Latest Post

Telugu - అంపకాలు

Written By Anirudh on Monday, April 23, 2012 | 2:57 AM


అంపకాలు పాఠ్యభాగం



కవి పరిచయం: కొడవటిగంటి కుటుంబరావు 
కాలం: 20 శతాబ్దం
రచనలు: వ్యాసాలు - కథలు - గల్పికలు నవలలు నాటికలు రచించారు. అరుణోదయం - వారసత్వం - చదువు, ప్రేమించిన మనిషి మొదలైనవి ఆయన నవలలు.
ముఖ్యవిషయాలు: సారళ్యం, సూటిదనం, స్పష్టత, పదునూ ఉన్న వచన రచన ఈయన ప్రత్యేకత.
నేపథ్యం: చిన్న పిల్లల్లో ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే పట్టుదల కూడా ఎక్కువే. అలాంటి చిన్నపిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలనేదే పాఠం నేపథ్యం.
ప్రక్రియ: గల్పిక పరిమాణంలో కథానిక కంటే చిన్నది. విమర్శ ఇందులో ప్రధానం. ఒక వ్యక్తి అనుభవంలో ఒక దశ లేదా ఒక సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషం గల్పికలో వస్తువు. గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు భావదృష్టికీ రచయితలు ప్రాముఖ్యం ఇస్తారు.
పాత్రలు - స్వభావాలు
చిట్టి: చిట్టికి బాబాయి అంటే బాగా ఇష్టం. బాబాయి తనను విడిచి పెట్టి ఊరికి వెళుతున్నాడంటే ఎంతో బాధపడింది. బాబాయి ఎత్తుకుని బుజ్జుగిస్తున్న కొద్దీ మారాం చేసింది. తల్లిదండ్రులు బాబాయి చంకదిగమని కోప్పడితే బావురుమన్నది. చిన్నపిల్లల మనస్తత్వానికి చిట్టి ఒక నిదర్శనం.
చిట్టి బాబాయి: అంపకాలు పాఠంలో ఒక పాత్ర. చిట్టి తనపై చూపించిన ప్రేమను సందేహించాడు. అంతకుముందు చిట్టి ఇలాంటి ప్రేమను చూపించలేదని ఆశ్చర్యపోయాడు. ఏడుస్తున్న చిట్టిని బుజ్జగించి ఓదార్చిన దయా స్వభావం కలవాడు.                      
                                 సందర్భవాక్యాలు
1. అతడికి ప్రేమను నమ్మాలో నమ్మరాదో తెలీలేదు.
పరిచయం: వాక్యం కొడవటిగంటి కుటుంబరావు రచించిన అంపకాలు అనే పాఠంలోది.
సందర్భం: బాబాయి ఊరికి వెళుతుంటే చిట్టికి పట్టరాని దుఃఖం వచ్చింది. బాబాయి చంక ఎక్కి దిగకుండా మారాం చేసింది.
2. అందరూ ఒక్కసారిగా మాట్లాడుతున్నారు.
పరిచయం: వాక్యం కొడవటిగంటి కుటుంబరావు రచించిన అంపకాలు అనే పాఠంలోది.
సందర్భం: బాబాయి ఊరికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కి వెళ్లాడు. రోజు మెయిలు ఏడుగంటల ఆలస్యంగా వస్తుందని తెలిసి మళ్లీ ఇంటికి వచ్చాడు. అప్పటికే చిట్టి నిద్ర పోతోంది. అయితే ఇంట్లో వాళ్లు మాట్లాడుతున్న అలికిడికి ఆమె మేలుకుంది. కానీ కళ్లు తెరవలేదంటూ రచయిత తెలియజేసే సందర్భంలోది.
వివరణ: బాబాయి రైల్వేస్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా మాట్లాడసాగారని అలికిడికి చిట్టికి మెలకువ వచ్చిందని భావం.

Kevin Trudeau - Mega Memory Workbook

Written By Anirudh on Friday, April 13, 2012 | 10:19 PM

Statements and Sets - Explanation

Written By Anirudh on Tuesday, April 10, 2012 | 5:03 AM

Statements and Sets
Watch the Video


Overview of Statements and sets - Explanation

Telugu - Bondu Mallelu

Written By Anirudh on Monday, April 2, 2012 | 3:42 AM



బొండు మల్లెలు

పాఠ్యభాగం
కవి పరిచయం: చాగంటి సోమయాజులు 20వ శతాబ్దానికి చెందినవాడు. ఆధునిక తెలుగు కథానిక రచయితల్లో పేర్కొనదగినవాడు. అభ్యుదయ భావాలను అందించాడు. చాసో కథలు, పరబ్రహ్మం, కుక్కుటేశ్వరం మొదలైనవి ఇతర కథలు. రచయిత ఆధునిక జీవితాన్ని వాస్తవిక దృష్టితో చూశారు.
నేపథ్యం: మన చుట్టూ ఉండే సమాజంలో మనకు తెలియకుండానే శ్రమదోపిడీ ఎలా జరుగుతుందో చాగంటి సోమయాజులు బొండుమల్లెలు పాఠం ద్వారా చెప్పదలచుకున్నారు. శ్రమకి తగిన ప్రతిఫలం అందరికీ లభించాలి. దోపిడీ వ్యవస్థ పోవాలనేది ఈ పాఠం నేపథ్యం.
ప్రక్రియ - కథానిక : కథ - కథానిక అనే మాటలను ఇప్పుడు పర్యాయ పదాలుగా వాడుతున్నాం. వ్యక్తి జీవితంలోని ఒక ముఖ్య సన్నివేశాన్ని, సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది కథానిక. ఇది వచన ప్రక్రియ. క్లుప్తత దీని ప్రధాన లక్ష్యం. పాత్రలూ, నేపథ్యం, కథనం, జీవిత వాస్తవికత చిత్రణ కథానికలో భాగాలు.
పాత్రలు - స్వభావాలు
తాత: బొండుమల్లెలు పాఠంలో ఒక పాత్ర. పొట్టకూటికోసం కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవాడు. నోరూవాయీ లేదు. గంజి నీళ్లకే సంతోషించేవాడు. కూలి తక్కువైనా అడగనివాడు.
వంకాయలమ్మే మనిషి: బొండుమల్లెలు పాఠంలో ముసలితాత మరణించాడని రచయితకు చెప్పింది ఈమే. కూతురు సరిగాచూడక తాత మరణించాడని రచయితకు తెలిపింది.
తాత కూతురు: ఈమె తండ్రికి రోజూ అన్నం పెట్టదు. జీతం ఇచ్చినప్పుడు మాత్రం పట్టెడన్నం పెట్టేది. తండ్రికి జబ్బు చేసినప్పుడు సరిగా చూడకపోవడంతో అతడు మరణిస్తాడు. ఈమె చెడు ఘటికురాలు.
సారాంశం
బొండుమల్లెలు రచయిత ఇందులో కథకుడు. ఇతడి ఇంటి పెరడు ఖాళీగా ఉందని మల్లె మొక్కలు పెంచుదామని అనుకుంటాడు. కానీ ఇది దోపిడీ అవుతుందని అనుకుంటాడు. ధనవంతులే మల్లెపూలు కొంటారు. వాళ్లు ఇతరులను దోచుకుని ధనవంతులవుతారు. తాను వాళ్లని మల్లెలతో దోచుకుంటానని సమర్థించుకుంటాడు. మల్లె మొక్కలు పాతడానికి కూలీ అవసరమవుతాడు. ఒక ముసలి వ్యక్తిని తక్కువ ధరకు మాట్లాడుకుంటాడు. అతడు కష్టపడి మల్లెపూల మొక్కలను పెంచుతాడు. మల్లెలు విరగకాస్తాయి. ముసలి తాతే అమ్మి డబ్బులు తెచ్చేవాడు. తనకు కూలి ఎక్కువ వద్దని, గంజిపోయమని అడుగుతాడు.
ముసలి తాత కూతురు దగ్గర ఉంటున్నాడు. కానీ ఆమె సరిగా చూడదు. మల్లెతోట వల్ల రచయితకి ఖర్చులన్నీ పోయి మూడు వందలు లాభం వచ్చింది. తొలకరి వచ్చినా తాత మళ్లీ పనిలోకి రాడు. అతడిని తాత అని పిలవడం తప్పితే అతడి పేరు, నివాసం తెలియదు. ఒక రోజు వంకాయలమ్మే అమ్మాయి చెబుతుంది తాత చనిపోయాడని. కూతురు సరిగా చూడకపోవడంతో జబ్బుతో చనిపోయాడని చెబుతుంది.
తాత చనిపోయాడని తెలిసి రచయిత బాధపడతాడు. బొండుమల్లెలు వేసిందీ, పెంచిందీ, అమ్మిందీ తాతే. కానీ ఫలితం రచయిత పొందాడు. అతడిని దోపిడీ చేసాడు. కష్టం తాతది ఫలితం రచయితది. మనకు తెలియకుండానే ఇతరుల శ్రమని ఏవిధంగా దోపిడి చేస్తున్నామో చాసో ఈ కథలో వివరించారు.
సందర్భాలు

1. అతడిని తీసుకెళ్లడం శుద్ధ దండగ (లేదా) ముష్కరమైనవాడైతే అయిదురోజులు చేస్తాడు.
పరిచయం: ఈ వాక్యం చాగంటి సోమయాజులు రచించిన 'చాసో కథలు' అనే సంపుటం నుంచి గ్రహించిన బొండుమల్లెలు కథానికలోది.
సందర్భం: మల్లెతోట పెంచడానికి ఒక ముసలి తాత వస్తే అతడిని చూసి రచయిత పైవిధంగా అనుకున్నాడు.
వివరణ: మల్లెతోట వేయడానికి కూలి మనిషి కావాల్సి రచయిత వెళ్తాడు. అక్కడ ఒక ముసలి తాత వస్తే ఇతడు బలమైనవాడు కాదు. అయిదు రోజుల్లో చేసేపని పదిరోజులు చేస్తాడు. కాబట్టి ఇతడిని పనిలోకి తీసుకోవడం దండగ అని రచయిత భావం.
2. అంత చిత్రంగా ఉంటాయి మన సంబంధ బాంధవ్యాలు.
పరిచయం: ఈ వాక్యం చాగంటి సోమయాజులు రచించిన 'చాసో కథలు' సంపుటిలోని బొండుమల్లెలు అనే కథలోది.
సందర్భం: ముసలి తాత తొలకరికి పనికి రాలేదు. అప్పుడు రచయిత తాత ఎందుకు రాలేదు అని ఆలోచిస్తూ పలికిన సందర్భంలోది.
వివరణ: తొలకరి వచ్చింది. ముసలి తాత పనిలోకి రాలేదు. అతడి గురించి తెలిసినవాళ్లులేరు. ఇన్నాళ్లుగా పనిచేస్తున్నా తాత అనడమే తప్ప అతడి పేరు, ఇల్లు గురించి కనుక్కోలేదని రచయిత బాధపడతాడు. మానవ సంబంధ బాంధవ్యాలు ఇలాగే ఉంటాయి. అవసరం తప్ప అనుబంధం తక్కువ. ఇది విచిత్ర విషయమని రచయిత భావన.
( రచయిత - ఎస్.ఎస్.కె. భగవాన్)


 
Support : Creating Website | Johny Template | Mas Template
Copyright © 2011. Indian Merit - All Rights Reserved
Template Created by Creating Website
Proudly powered by Blogger